జై గురుదత్త !
"విశ్వ కళ్యాణము" ~ దాని నిమిత్తం 'శాంతి స్థాపన' యే వారి నిత్య సత్య ధర్మంగా ~ అది నెరవేరుటకు ఎన్నో రకాలుగా దివ్య సేవలను సదా అందిస్తూ మనకు 'దత్తం' అయిన దత్త పీఠాధిపతులు పరమపూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 'దత్తపీఠము' లో ఓ నిత్య సత్య భాగం ~ ఎన్నో కోణాలలో మానవాళికి వారి 'ఆశ్రమం' తరపున, శ్రీ స్వామీజీ వారి పర్యవేక్షణలో వారి ఎన్నో అనుబంధ శాఖలు అందించే "సేవాకార్యక్రమాలు"

"మానవ సేవయే మాధవ సేవ" అనునటుల శ్రీ స్వామీజీ వారు ఎన్నో మార్లు వారి సందేశాలలో ఇలా తెలియచేశారు. "ఆధ్యాత్మిక జీవితం అనగా ధ్యానము, జ్ఞాన సముపార్జన ఒక్కటే కాదు, అవసరంలో ఉన్న పీడితులకు 'సేవ' లని అందించటం కూడా అని.

ఇలా ఆహారం, విద్య, నివాసం, ఉచిత వైద్య సహాయం పేదలకు అందించే నిమిత్తం 'దత్తపీఠమ్' సదా వారి ఆశ్రమం తరపున ఈ సేవలను అందిస్తూనే ఉన్నారు.

విద్య: 1200 విద్యార్ధులు చదువుకొనగలిగేలా 'దత్తపీఠము' ఆర్ధిక సహాయమందిస్తున్నది. 1989 వ సం|| నుంచి. అంతే గాక మరి ఒక 600 మంది విద్యార్ధులు చదువుకోటానికి కావలసిన ఆర్ధిక సహాయంను కూడా దత్తపీఠము బాధ్యత వహించుచున్నది.

"నేటి విద్యార్ధులే రేపటి భావి భారతమును తీర్చిదిద్దే పౌరులుగా" భావించి ఈ మహత్తరమైన 'విద్యా' కార్యక్రమాన్ని ఓ'సేవ' గా చేయుచున్నది.

వైద్యం: దత్తపీఠము వైద్యసేవలని కూడా అందించుచున్నది. "పేదవారికి ~ వైద్య సౌకర్యాలు ఏ మాత్రం లేని ప్రదేశాలకి" ఓ'కదిలే వైద్యశాల' (Mobile Hospital) సహాయంతో. ప్రాచీన ఆయుర్వేద వైద్యంతో పాటుగా, దంత వైద్యం, కంటి ఆపరేషన్లు, "మధుమేహరోగాల నుంచి ఎలా తిరిగి స్వస్థత పొందాలి" అనే ఉచిత వైద్య శిబిరాలను, నెలసరి వైద్య కార్యక్రమాలను నిర్వహించుచున్నది.

"ఆరోగ్యమే మహాభాగ్యం" అన్న 'పరమసత్యాన్ని' దృష్టిలో ఉంచుకుని 'దత్తపీఠము' వారు ~ ఇలా వైద్య సేవలను అందిస్తున్నారు.

వారి సేవా కార్యక్రమాలలో ఇవి కూడా భాగాలు:-

* అత్యవసర వైద్య సహాయం నిమిత్తమై అంబులెన్సులు .....చిన్న చిన్న ఊర్లకి.

* కనీస సౌకర్యాలే లేని విద్యాలయాలలో 'మరుగుదొడ్లు నిర్మించటం ~ తద్వారా శుచీ, శుభ్రతలతో కూడిన ఆరోగ్యకర వాతావరణంలో విద్యార్ధులు చదువుకొని, మంచి విద్యని ఆర్జించాలని.

* పండితులు వారి జ్ఞానాన్ని ముద్రించుకోగలుగుటకు కావలసిన సహాయమందించటం "సామూహిక వివాహాలు" జరిపించడం.

* జైళ్ళలోని ఖైదీల ఆలోచనా తీరు, విధానం ఉన్నతంగా మారే దిశగా వారికొరకై 'క్రియాయోగా' శిక్షణా శిబిరాలను ఏర్పరచటం.

* స్కాలర్ షిప్ ల రూపంలో విద్యార్ధులకు, పండితులకు ధన సహాయ మందించటం. శిధిలమైపోతున్న దేవాలయాల పునరుద్ధరణకు సహాయమందించటం.

* విద్యాలయాలకు కావలసిన వస్తు సామాగ్రిని అందించటం.

* ఉచిత వైద్య సేవలు వారి అన్ని దత్తపీఠశాఖలలో.... తగు వీలు ఉన్నంతవరకూ.

* ఏదిక్కు లేని వృద్ధ మహిళలకు 'అమ్మ ఒడి' అనే నివాస గృహము.

* అంగవికలురకు వీల్ ఛైర్స వంటివి ఇవ్వటం, స్వయం ఉపాధి మహిళలకు కుట్టు మిషన్లు వంటివి ఇచ్చి వారిని ప్రోత్సహించడం వారి కాళ్ళపై వారు ఆధారపడేలా.

* ఇవే కాక ప్రకృతి ఉపద్రవాలు వచ్చిన సందర్భంలో 'దత్త పీఠము' వారు ధన సహాయమే కాకుండా "Datta Seva" పేరుతో వారు చేసే సామాజిక సేవలు ఎన్నో.

ఇంకా దత్తపీఠము క్రింద,...'వేద పాఠశాల' ద్వారా ... వేద పఠనము, సంస్కృత బోధ, అర్చకత్వ శిక్షణ అను దివ్య సేవలను చేపట్టటం జరిగింది. ఇది మైసూరులోని 'దత్త పీఠము' యొక్క ఆశ్రమ ప్రాంగణంలోనే నిర్వహించబడుచున్నది. ఇప్పటి వరకు 150 మందికి పైగా ఈ పైన చెప్పబడిన వివిధ శాఖలలో విద్య నభ్యసించటం జరిగినది. ఇదే గాక సంవత్సరానికి ఒక మారు స్త్రీలకు 'నిత్య పూజావిధానము' పై శిబిరాలు నెలకొల్పటం జరుగును. 'యజుర్ వేద విద్యాలయం' కూడా ఆంధ్రప్రదేశ్ లోని 'పీఠాపురము' అనే పట్టణములో నడువటం జరుగుచున్నది.

* అంతేగాక దత్తపీఠము వారు గ్రుడ్డి,చెవిటి ,మూగ వారి కొరకై 'బెంగుళూరు'లో ఓ విద్యాలయం సుశిక్షితులైన బోధకుల పర్యవేక్షణలో నడపటం జరుగుచున్నది.

ఇలా 'దత్తపీఠము' వారు సామాజిక శ్రేయస్సు, విశ్వమానవ శ్రేయస్సులను దృష్టిలో ఉంచుకొని విస్తృత సేవాకార్యక్రమాలను చేపట్టి దిగ్విజయంగా కొనసాగించటం జరుగుచున్నది.

దేశ, విదేశాలలోని 'దత్తపీఠము' యొక్క ఎన్నో శాఖలు వారి వారి ప్రాంతాలలో ఎన్నో రకాల సేవలను అందిస్తూ ఉన్నారు శ్రీ గణపతి సచ్చిదానందుల వారిపై వారికున్న అనంతమైన ప్రేమను,భక్తిని ~ వారి సేవల రూపంలో అందిస్తూ ~ శ్రీ స్వామీజీ వారి దివ్య సందేశాలలోని అంతరార్ధానికి ఓ కార్యరూపం తెస్తున్నారు.

సేకరణ ...Dattapeetham.com

"సర్వేజనా సుఖినోభవంతు"

ఓం శాంతి ; శాంతి; శాంతిహిః